News

భారీగా వెయ్యి నోట్ల పట్టివేత


రద్దయిన పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసే గడువు పూర్తయినా.. లెక్కలు చూపించలేని కొంతమంది వాటిని తమ దగ్గరే ఉంచుకున్నారు. చత్తీస్‌గఢ్‌లో అధికారులు శనివారం భారీగా వెయ్యినోట్లను సీజ్‌ చేశారు. భానుప్రతాప్‌పూర్‌లో ఓ వ్యక్తి దగ్గర భారీగా రద్దయిన నోట్లు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. 19 లక్షల విలువైన వెయ్యినోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. మావోయిస్టులకు సంబంధించిన డబ్బుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.